
వక్ఫ్ బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్
బాపట్ల: జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్‌లో జిల్లా వక్ఫ్ బోర్డు కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్ బోర్డ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ ఆస్తుల క్రయవిక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిషేధిత జాబితాలో పెట్టాలని అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీశివజ్యోతి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నాయక్, బాపట్ల ఆర్డీఓ రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయకృష్ణన్