
ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
బాపట్ల: మున్సిపాలిటీలో జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్యాడిసన్‌పేట జగనన్న కాలనీలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల మున్సిపాలిటీ ప్యాడిసన్‌పేట జగనన్న కాలనీ 1740 గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం1409 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయనీ, ఇప్పటి వరకు ప్రారంభించని గృహ నిర్మాణ లబ్ధిదారులకు 2.90 లక్షల రూపాయలతో మోడల్ హౌస్స్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గృహ నిర్మాణాలను ప్రారంభించడానికి అవసరమైన బ్యాంక్ రుణాలను ఇప్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్యాడిసన్‌పేట జగనన్న కాలనీలో అంతర్గత రోడ్డు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.