
సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలోనే ఏకంగా రూ.2.25 లక్షల కోట్ల విలువైన సంక్షేమాన్ని మహిళలకు అందించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెక్షన్ హాలులో వైఎస్సార్ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పేదలకు రూ.2.25 లక్షల కోట్ల విలువైన లబ్ధిని చేకూరిస్తే, అందులో రూ.1.41 లక్షల కోట్లు నేరుగా డీబీటీ పద్ధతిలో మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినా, పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
జగనన్నతోనే ఇది సాధ్యం
మంత్రి విడదల రజిని
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం