జె.పంగులూరు: జగనన్న లేఔట్‌లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ జేఎండీ శివప్రసాద్ అన్నారు. ముప్పవరం లేఔట్‌ను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం వెంటనే బిల్లులు మంజూరు చేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారు వెంటనే చేపట్టాలన్నారు. ముందుగా జేఎండీ శివప్రసాద్‌ను గ్రామ సర్పంచ్ సాంబశివరావు, ఎంపీటీసీ గంగాధర్ శాలువా కప్పి సన్మానించారు. పీడీ ప్రసాద్, డీఈ శర్మ, ఎంపీడీవో రమణమూర్తి, హౌసింగ్ ఏఈ కిషోర్, పీఆర్‌ఏఈ రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.