నిజాంపట్నం: నిజాంపట్నం పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్న మోపిదేవి నాగేశ్వరరావు అవకతవకలకు పాల్పడినందున 6 నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు పీఏసీఎస్ చైర్మన్ మరకా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నిజాంపట్నంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్‌ను పంపకపోవడం, 2018–19 నుంచి ఐటీ రిటర్న్స్‌ను సంఘం పేరున ఉన్న పాన్‌కార్డుపై కాకుండా సంఘ అధ్యక్షుడి పాన్‌కార్డు ద్వారా పంపడం, సంఘ సభ్యులు కొంత మందివి పాస్‌బుక్‌లు పోగొట్టడం వంటి పలు అవకతవకలపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.