దంత వైద్యుడు మృతి

- - Sakshi

అద్దంకి రూరల్‌: అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో దంతవైద్యుడిగా పనిచేస్తున్న ఎన్‌ శ్రీనివాసరెడ్డి(54) శుక్రవారం రాత్రి పట్టణంలోని ఓ లాడ్జిలో మృతి చెందాడు. అందిన వివరాల మేరకు.. గత కొంతకాలం నుంచి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో దంతవైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి ఒక్కడిగానే స్థానిక ఓ లాడ్జిలోని గదిలో అద్దెకు ఉంటున్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి గదిలో అపస్మారక స్థితిలో పడిఉన్న దంతవైద్యుడిని చూసి లాడ్జి సిబ్బంది వైద్యశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నెల్లూరు చెందిన వ్యక్తి కాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

వృద్ధుడి మృతదేహం లభ్యం

మేదరమెట్ల: ఓ వృద్ధుడి మృతదేహం శుక్రవారం మేదరమెట్ల సమీపంలోని ఉత్తర బైపాస్‌ పాతగుంటూరు రోడ్డు, బాయిల్డ్‌ రైస్‌మిల్లు వద్ద కనిపించింది. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ శివకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. ఎస్‌ఐ అందించిన వివరాలు మేరకు.. అద్దంకి మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బీమనాథం కోటిరెడ్డి(72) భార్య రెండన్నర సంవత్సరాల కిందట మృతి చెందింది. ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నాడు. ఈక్రమంలో కోటిరెడ్డి ఈనెల 5వ తేదీన పింఛన్‌ డబ్బులు తీసుకుని ఇంటినుంచి బయటకు వెళ్లాడు. నాలుగు, ఐదు రోజుల కిందట బంధువుల ఇంటి నుంచి వచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. శుక్రవారం ఉదయం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుమారుడు మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏపీ టూరిజం మాజీ డైరెక్టర్‌ రాజేశ్వరి మృతి

చినగంజాం: రాష్ట్ర ఏపీ టూరిజం మాజీ డైరెక్టర్‌ మాగులూరి రాజేశ్వరి(63) గురువారం మృతి చెందారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని నీలాయపాలెం గ్రామ పంచాయతీకి చెందిన రాజేశ్వరి ఇటీవల నేపాల్‌ తీర్థయాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉత్తరప్రదేశ్‌లోని ఖరగ్‌ఫూర్‌లో రైలులో ఎక్కిప్రయాణం చేస్తుండగా శ్వాస సంబంధ సమస్య తలెత్తింది. రెండు గంటల ప్రయాణం అనంతరం బారాబంకి అనే గ్రామంలో రైల్వే స్టేషన్‌లో దించి స్థానిక వైద్యశాలలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె ఆ పాటికే ఊపిరి ఆడక పోవడంతో మరణించినట్లు ధ్రువీకరించారు. ఆమెకు భర్త మాగులూరి ఆంజనేయులు రైతు కాగా, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిరువురికి వివాహాలు అయ్యాయి. ఆమె కొంత కాలం ఏపీ టూరిజం డైరెక్టర్‌గా పదవిని నిర్వహించారు. ఆమెకు మహిళా నాయకురాలిగా మంచి పేరుంది. మండలంలోని పలు సమస్యలమీద గతంలో అధికారులతో పోరాడి వాటి పరిష్కారానికి కృషి చేశారు. ఆమె భౌతికకాయాన్ని ఉత్తరప్రదేశ్‌ నుంచి అంబులెన్స్‌లో స్వగ్రామానికి శుక్రవారం రాత్రికి తీసుకువస్తున్నట్లు బంధువుల సమాచారం. ఆమె మృతిక్లి మండలంలోని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top