వారఫలాలు (29 నవంబర్‌ నుంచి 05 డిసెంబర్‌ 2020 వరకు) | Weekly Horoscope From November 29 To December 5th 2020 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (29 నవంబర్‌ నుంచి 05 డిసెంబర్‌ 2020 వరకు)

Nov 29 2020 6:32 AM | Updated on Sep 13 2021 5:12 PM

Weekly Horoscope From November 29 To December 5th 2020 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతనోత్సాహంతో కొన్ని పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొత్త మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల ప్రయత్నాలు సఫలం. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కుటుంబంలో ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు.  ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. దీర్ఖకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు.దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు కొనసాగిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగయోగం కలుగవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం మధ్యలో బంధువులతో విభేదాలు, అనారోగ్య సూచనలు. ఎరుపు, గులాబీరంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.  మీ ఊహలు నిజం కాగల సూచనలు వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలమైన పరిస్థితి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఒడ్డునపడతారు. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్యహృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రారంభంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. రాజకీయవర్గాలకు ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
రుణభారాలు కొంత తగ్గవచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ పుంజుకుంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల శ్రమ కొలిక్కి వస్తుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీపై వచ్చిన అపవాదులు తొలగి ఊరట చెందుతారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. కళారంగం వారికి కలలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతటి వ్యవహారమైనా విజయం సాధిస్తారు. పట్టుదల, ధైర్యంతో అడుగేసి సమస్యల నుంచి బయటపడతారు. మీలోని శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని వివాదాలు, సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఒక సమాచారం మీలో మార్పునకు కారణమవుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. వ్యాపారాల విస్తరణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. ఒప్పందాలు వాయిదా. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. ఆప్తుల నుంచి సలహాలు పొంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. కొత్తగా రుణాలు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా వ్యతిరేకత ఉంటుంది. ఆస్తుల విషయంలో సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. బంధువర్గంతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు చేజారి నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. 
-సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement