
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, తిథి: శు.అష్టమి రా.11.56 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.5.06 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: తె.4.44 నుండి 6.27 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.44 నుండి 9.30 వరకు, తదుపరి ప.12.25 నుండి 1.08 వరకు, అమృతఘడియలు: ప.12.26 నుండి 2.01 వరకు.
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.32
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుండి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
వృషభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు ఫలిస్తాయి.
మిథునం: ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తులు కొనుగోలు చేసే వీలుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కర్కాటకం: పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకం.
సింహం: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. బంధువులతో తగాదాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కన్య: రుణవిముక్తి లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు, వాహనాలు కొంటారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
తుల: ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
వృశ్చికం: రుణభారాలు. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపెట్టవచ్చు.
ధనుస్సు: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
మకరం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కుంభం: బాధ్యతలు పెరుగుతాయి. పనులు మధ్యలో నిలిపివేస్తారు. కుటుంబంలో సమస్యలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
మీనం: కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.