Today horoscope: ఈ రాశి వారికి ఈరోజు గుడ్‌న్యూస్‌ అందుతుంది

Today Horoscope 29-07-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.పాడ్యమి రా.11.46 వరకు, తదుపరి విదియ నక్షత్రం పుష్యమి ఉ.9.34 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం రా.11.32 నుండి 1.14 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.04 వరకు తదుపరి ప.12.32 నుండి 1.23 వరకు అమృతఘడియలు... లేవు. 

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం     :  6.31
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

వృషభం: పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మిథునం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందికరంగా సాగుతాయి.

కర్కాటకం: ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

సింహం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.

మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు విజయం. శుభవార్తలు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.

కుంభం: శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీనం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top