
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.ఏకాదశి రా.2.24 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం శతభిషం సా.6.46 వరకు, తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం రా.1.04 నుండి 2.37 వరకు, దుర్ముహూర్తం ఉ.8.10 నుండి 9.02 వరకు, తదుపరి రా.10.47 నుండి 11.33 వరకు అమృతఘడియలు... ప.11.49 నుండి 1.21 వరకు.
సూర్యోదయం : 5.41
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు:
మేషం... యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశయాలు సిద్ధిస్తాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
వృషభం... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆప్తుల సలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మిథునం... పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు.
కర్కాటకం... బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినవిధంగా ఉంటాయి.
కన్య... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
తుల... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చిక్కులు.
వృశ్చికం... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు చక్కదిద్దుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మకరం... కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో విరోధాలు. పన్లులో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకులు పరుస్తాయి.
కుంభం... పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
మీనం... కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.