
ఈ రాశివారు శుభవార్తలు అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు..
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు. భాద్రపద మాసం,
తిథి: బ.దశమి రా.8.20 వరకు, తదుపరి ఏకాదశి,
నక్షత్రం: పునర్వసు రా.9.20 వరకు, తదుపరి పుష్యమి వర్జ్యం: ఉ.8.02 నుండి 9.47 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.44 నుండి 11.31 వరకు,
అమృతఘడియలు: సా.6.40 నుండి 8.24 వరకు.
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.57
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. బంధువులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
వృషభం: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. పనులు నిదానంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
మిథునం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కర్కాటకం: రాబడి కన్నా ఖర్చులు అధికం. పనులు నిదానంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
సింహం: ఉత్సాహం, పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూలం.
కన్య: శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
తుల: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు.
ధనుస్సు: బంధువుల కలయిక. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.
మకరం: అనుకున్న పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కుంభం: సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.
మీనం: వ్యయప్రయాసలు. ఊహించని ప్రయాణాలు. ఆస్తులు వివాదాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.