Today's Horoscope: ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు..

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.విదియ రా.7.51 వరకు, తదుపరి తదియ నక్షత్రం శ్రవణం రా.9.21 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం రా.1.06 నుండి 2.36 వరకు,దుర్ముహూర్తం ఉ.8.10 నుండి 9.04 వరకు తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు అమృతఘడియలు... ఉ.11.34 నుండి 1.04 వరకు.
సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ప.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ఉ.3.00 నుంచి 4.30 వరకు
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. శ్రమకు ఫలితం కనిపించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలలో కొన్ని అవాంతరాలు. ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది.
వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.
మిథునం: విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు. వస్తులాభాలు.
కర్కాటకం: పనులలో కొంత జాప్యం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. దైవచింతన.
సింహం: బంధువులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కళాకారులకు ఒడిదుడుకులు.
కన్య: ముఖ్య పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కీలక సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు రాగలవు. ఆలయ దర్శనాలు.
తుల: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.
వృశ్చికం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
ధనుస్సు: బంధువులతో కొన్ని వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనులు వాయిదా. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మకరం: శుభవార్తలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. మిత్రుల నుంచి వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
కుంభం: నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వస్తు, వస్త్రలాభాలు. ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.
మీనం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.