ఈ రాశి వారికి ఆర్థిక ప్రగతి.. పలుకుబడి పెరుగుతుంది | Rasi Phalalu: Daily Horoscope On 14-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆర్థిక ప్రగతి.. పలుకుబడి పెరుగుతుంది

May 14 2026 4:04 AM | Updated on May 14 2026 5:15 AM

Rasi Phalalu: Daily Horoscope On 14-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.7.49 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: రేవతి రా.8.01 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: ఉ.8.22 నుండి 9.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.45 వరకు, అమృత ఘడియలు: సా.4.40 నుండి 7.14 వరకు.

సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.19
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం.....ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధుగణంతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం... నూతన విద్య, ఉద్యోగయోగాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మిథునం... పలుకుబడి పెరుగుతుంది. ఊహలు నిజం కాగలవు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

కర్కాటకం...సన్నిహితులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

సింహం.... కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారులు  నిరాశ చెందుతారు. శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య.... మిత్రుల నుంచి మాటసహాయం. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారవృద్ధి.

తుల.... పరిచయాలు పెరుగుతాయి. కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

వ్చశ్చికం.... రుణఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో తగాదాలు.

ధనుస్సు... ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. బంధువర్గంతో మాటపట్టింపులు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.

మకరం... నూతన పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. పదవులు దక్కుతాయి.

కుంభం... దూరప్రాంతాలకు వెళ్లాల్సివస్తుంది. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశపరుస్తాయి.

మీనం.. ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. శుభవార్తలు వింటారు.

Advertisement
 
Advertisement
Advertisement