ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 06-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు

May 6 2026 3:51 AM | Updated on May 6 2026 8:32 AM

Rasi Phalalu: Daily Horoscope On 06-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పంచమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: మూల ప.1.16 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.11.29 నుండి 1.16 వరకు, తదుపరి రా.11.48 నుండి 1.33 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: ఉ.6.10 నుండి 7.56 వరకు.

సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

వృషభం....  వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

మిథునం.....  కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం....  మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనుల్లో పురోగతి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

సింహం.... పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

కన్య.....  మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల....  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

వృశ్చికం...  కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువర్గంతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

ధనుస్సు....  సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మకరం....  రుణాలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం....  అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని ప్రగతి.

మీనం...  పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement