Horoscope Today: February 26, 2023 - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి ఎదురుండదు.. గుడ్‌న్యూస్‌ వింటారు..

Feb 26 2023 6:36 AM | Updated on Feb 26 2023 11:27 AM

Horoscope Today 26 02 2023 - Sakshi

పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శు.సప్తమి తె.5.03 వరకు(తెల్లవారితే సోమవారం) తదుపరి అష్టమి నక్షత్రం భరణి ఉ.8.21 వరకు తదుపరి కృత్తిక వర్జ్యం రా.8.41 నుండి 10.22 వరకు దుర్ముహూర్తం సా.4.28 నుండి 5.15 వరకు అమృతఘడియలు.. లేవు, రాహుకాలం సా.4.30 నుండి 6.00 వరకు యమగండం ప.12.00 నుండి 1.30 వరకు, సూర్యోదయం 6.26 సూర్యాస్తమయం 6.01

మేషం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం.

మిథునం: పనుల్లో అవాంతరాలు తొలగుతాయి.  శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: దూరపు  బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కన్య: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

కుంభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభపరిణామాలు.

మీనం: కుటుంబసమస్యలు తప్పవు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement