ఈ రాశివారికి ఊహించని ధన లాభం..

Horoscope Today 23 02 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం తిథి శు.తదియ ఉ.7.42 వరకు తదుపరి చవితి నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.9.04 వరకు తదుపరి రేవతి వర్జ్యం రా.8.44 నుండి 10.17 వరకు దుర్ముహూర్తం ఉ.10.17 నుండి 11.04 వరకు తదుపరి ప.2.54 నుండి 3.40 వరకు అమృతఘడియలు... లేవు రాహుకాలం ప.1.30 నుండి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుండి 7.30 వరకు సూర్యోదయం 6.27 సూర్యాస్తమయం 6.00

మేషం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు.  వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళాకారులకు సన్మానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.

మిథునం: పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో జాప్యం. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. 

సింహం: అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.  ఉద్యోగాలలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు.

కన్య: కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.  ధనలబ్ధి. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

తుల: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో  ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. పనులు చకచకా సాగుతాయి..

వృశ్చికం: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.

ధనుస్సు: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి  వివాదాలు ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. 

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులకు శుభవార్తలు.  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

కుంభం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.  కుటుంబ సమస్యలు తీరతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top