ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. వ్యాపారాల్లో శుభసూచకం..

Horoscope Today 21-02-2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.11.24 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: శతభిషం ఉ.11.23 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: సా.5.25 నుండి 6.56 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.44 నుండి 9.33 వరకు, తదుపరి రా.10.59 నుండి 11.44 వరకు, అమృతఘడియలు: రా.2.30 నుండి 4.01 వరకు.

సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం : 5.59
రాహుకాలం : ప.3.00
నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు
 

మేషం: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: ఉద్యోగలాభం. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం: రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

సింహం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. దైవచింతన.

కన్య: వ్యవహారాలను చక్కదిద్దుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. ఆర్థికాభివృద్ధి.  వస్త్రలాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: రుణదాతల ఒత్తిడులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వ్యాపారాలలో  కొత్త ఆశలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు డీలా పరుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top