ఈ రాశివారు విలువైన వస్తువులు కొంటారు..

Horoscope Today 18 02 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.త్రయోదశి సా.6.20 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: ఉత్తరాషాఢ సా.4.11 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.7.54 నుండి 9.23 వరకు దుర్ముహూర్తం: ఉ.6.28 నుండి 8.01 వరకు అమృతఘడియలు: ఉ.10.05 నుండి 11.40 వరకు, మహాశివరాత్రి.

సూర్యోదయం: 6.29
సూర్యాస్తమయం   :  5.58
రాహుకాలం : ఉ.9.00
నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విందువినోదాలు.

వృషభం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. దూరప్రయాణాలు చేస్తారు.

మిథునం: ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం: కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. 

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.

కన్య: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

తుల: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక.

వృశ్చికం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వస్తులాభాలు.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆలయాల సందర్శనం. విద్యార్థులకు ఒత్తిడులు.

మకరం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: పనుల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మీనం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top