చిన్నపాటి జాగ్రత్తలతో.. వేసవి టూర్‌ బీ హ్యాపీ | - | Sakshi
Sakshi News home page

చిన్నపాటి జాగ్రత్తలతో.. వేసవి టూర్‌ బీ హ్యాపీ

May 7 2025 1:29 AM | Updated on May 7 2025 1:29 AM

చిన్న

చిన్నపాటి జాగ్రత్తలతో.. వేసవి టూర్‌ బీ హ్యాపీ

పర్యాటక ప్రాంతాల పర్యటనలకు ప్రణాళిక తప్పనిసరి

గుర్తింపు కార్డులు, మెడికల్‌ కిట్లు

వెంట తీసుకెళ్తే మంచిది

చిన్నపిల్లల జేబుల్లో ఫోన్‌ నంబర్‌,

చిరునామా స్లిప్పులు ఉంచాలి

ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీ ముచ్చట వద్దు

రాజంపేట టౌన్‌ : వేసవి సెలవుల్లో విహార యాత్రలకు వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. కొంత మంది కుటుంబ సభ్యులే వెళుతుంటారు. మరికొందరు బంధు, మిత్రులతో బృందాలుగా ఏర్పడి ప్యాకేజీలు మాట్లాడుకొని సంతోషంగా గడిపేందుకు టూర్‌లకు వెళుతుంటారు. సెలవుల్లో సేద తీరడంతో పాటు కొత్త ప్రాంతాలను సందర్శించామనే తృప్తి కోసం వేసవి సెలవుల్లో చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళతారు. వేసవి సెలవుల్లో ప్రధానంగా చాలా మంది సొంత గ్రామాలకు, బంధువుల ఊళ్లకు వెళ్లడం, పర్యాటక ప్రాంతాలను సందర్శించడం వంటివి చేస్తుంటారు. అయితే ప్రయాణాలు, విహార యాత్రల్లో ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా విజయవంతమై సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలంటే ప్రణాళికలు రూపొందించుకొని వాటిని అనుసరించడం చాలా అవసరం. టూర్‌లకు వెళ్లే వారు వారి వారి పరిధిలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే యాత్ర ఆనందాల హారంగా మారుతుంది.

సన్నద్ధత ముఖ్యం..

● విహార యాత్రలకు వెళ్లే సమయంలో అందరిలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహంలో కొన్ని సమయాల్లో చిన్నపిల్లల గురించి మరచిపోయే అవకాశం లేకపోలేదు.

● యాత్ర ప్రదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ముందే తెలుసుకొని సమయం సద్వినియోగం అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి.

● టూర్‌కు వెళ్లే ప్రతి ఒక్కరు ఫోటో, చిరునామాతో కూడిన గుర్తింపు కార్డు ఎప్పుడు తమ వెంట ఉంచుకొని ఉండాలి. కొన్ని సందర్భాల్లో వీటి అవసరం ఏర్పడుతుంది.

● విధిగా ప్రథమ చికిత్సకు సంబంధించిన వైద్య సామగ్రి వెంట తీసుకెళ్లాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులకు సంబంధించిన మాత్రలను వెంట ఉంచుకోవాలి.

● పర్యాటక ప్రాంతాలను సందర్శించినప్పుడు వాటి చరిత్ర, అక్కడి విశేషాలను, మధురానుభూతులను డైరీలో రాసుకుంటే అవి జీవితాంతం గుర్తుండిపోతాయి.

చిన్నపాటి జాగ్రత్తలతో పర్యటనలు సుఖాంతం..

● పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి

● కుటుంబ సభ్యులందరితో పాటు విహార యాత్రకు వెళ్లేటప్పుడు ఆ బృందంలో ఒక్కొక్కరుగా పిల్లల బాధ్యతను పంచుకోవాలి

● చిరునామా, సెల్‌ నెంబర్‌ వివరాలు ఉన్న చిన్న స్లిప్పులు పిల్లల జేబుల్లో విధిగా ఉంచాలి.

● ముఖ్యంగా నదులు, చెరువులు, కోనేర్లు ఉన్న ప్రాంతాల్లో పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి

● నీటి పరివాహక ప్రాంతాలు, కొండలు, లోయలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈతకొట్టడం, ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు

● ఆహార పదార్థాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు

టూర్‌లకు వెళ్లినప్పుడు ముఖ్యంగా యువత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. అత్యుత్సాహం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రధానంగా ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లి సెల్ఫీ తీసుకోవడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన వంటలు ప్రసిద్ధి గాంచి ఉంటాయి. వాటి రుచిని ఆస్వాదించాలి. టూర్‌ మరో ఏడాది వచ్చే సెలవుల వరకు ఓ తియ్యటి జ్ఞాపకంలా ఉండాలి. – మోహనవల్లి,

ప్రభుత్వ అధ్యాపకురాలు, మదనపల్లె

చిన్నపాటి జాగ్రత్తలతో.. వేసవి టూర్‌ బీ హ్యాపీ 1
1/2

చిన్నపాటి జాగ్రత్తలతో.. వేసవి టూర్‌ బీ హ్యాపీ

చిన్నపాటి జాగ్రత్తలతో.. వేసవి టూర్‌ బీ హ్యాపీ 2
2/2

చిన్నపాటి జాగ్రత్తలతో.. వేసవి టూర్‌ బీ హ్యాపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement