పచ్చ రాతల్లో ‘అడ్రస్‌’ గల్లంతు | Sakshi
Sakshi News home page

పచ్చ రాతల్లో ‘అడ్రస్‌’ గల్లంతు

Published Wed, Sep 13 2023 5:01 AM

Yellow Media News Paper Fake News to Protect Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని దోచేసి.. పక్కా ఆధారాలతో దొరికి­పోయి.. రిమాండ్‌ ఖైదీగా జైలు­కెళ్లిన మాజీ సీఎం చంద్రబాబును ఉత్తమాతి ఉత్తము­డిగా కలరింగ్‌ ఇచ్చేందుకు ఓ పచ్చపత్రిక ఆప­సోపాలు పడుతోంది. సాంకేతిక పరిజ్ఞానంలో వారే ఆరితేరిన నిపుణులు అన్నట్టుగా భావించి, తెలిసీ తెలియని అంకెల గారడీని ప్రదర్శించింది.

చంద్రబాబు చేసిన స్కామ్‌ను అధికార పక్షం చేసిన స్కీమ్‌గా చిత్రీకరించే ప్రయత్నంలో బొక్కబోర్లా పడింది. ప్రపంచంలో ఏ రెండు కంపెనీల వెబ్‌సైట్లు, కంప్యూటర్లు ఒకే సర్వర్‌పై పని చేయవని, ఒకే సర్వర్‌ ఆధారంగా పని చేసే డొమైన్లు, కంప్యూటర్ల మధ్య డేటా షేరింగ్‌ జరుగుతుందంటూ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. చంద్రబాబు చేసిన స్కామ్‌ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించి దెబ్బ తిన్నది.

పచ్చ పత్రిక పిచ్చి రాతలు
స్కిల్‌ స్కామ్‌లో శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ కంపెనీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసింది. రూ.371 కోట్లు దారి మళ్లాయని నివేదిక ఇచ్చింది. ఇదే విషయాన్ని సీఐడీ తన విచారణ నివేదికలో స్పష్టంగా కోర్టుకు సమర్పించింది. ఇక్కడే పచ్చ పత్రిక బోడి గుండుకు.. మోకాలికి ముడి పెట్టింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీలకు ఆడిట్‌ నిర్వహించే ఐవీఎస్‌ కంపెనీ, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసిన శరత్‌ అసోసియేట్‌ కంపెనీ ఒకే సర్వర్‌పై ఆధారపడి కార్యకలాపాలు చేస్తున్నాయని, కాబట్టి చంద్రబాబు అరెస్టులో పెద్ద కుట్ర దాగుందన్న అసంబద్ధ వాదనతో బురద జల్లే ప్రయత్నం చేసింది.

అంతే గానీ తన కథనంలో ఎక్కడా చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని గానీ, కోర్టులో సీఐడీ అధికారులు సమర్పించిన ఆధారాలు తప్పని గానీ రాయకపోవడం పచ్చ పత్రిక పరోక్షంగా వాస్తవాన్ని ఒప్పుకున్నట్టు అయింది. అసలు సర్వర్లను ఎవరు హోస్ట్‌ చేస్తారు, వాటికి ఐపీ అడ్రస్‌లు ఎలా కేటాయిస్తారనేది తెలిస్తేం పచ్చ పత్రికది పిచ్చి రాతలని స్పష్టమవుతుంది.

ఆ రెండు కంపెనీలు ఒకే సర్వర్‌లో లేవు
పచ్చ పత్రిక చెప్పినట్టు శరత్‌ అండ్‌ అసోసి­యేట్స్, ఐవీఎస్‌ ఆడిట్‌ సంస్థ వెబ్‌సైట్లు ఒకే సర్వర్‌లో ఉన్నాయనేదే పచ్చి అబద్ధం. ఎల్లో రాతల్లోనే ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ ఐపీ అడ్రస్‌ 115.124.126.242.80. ఐవీఎస్‌ అండ్‌ అసోసి­యేట్స్‌ ఐపీ అడ్రస్‌ 115.124.126.216.80గా పేర్కొంది. ఇక్కడ వేర్వేరు ఐపీ అడ్రస్‌లు కనిపిస్తుంటే ఒకే అడ్రస్‌లో ఉన్నాయని రాయడం హాస్యాస్పదం.

వాస్తవానికి ఈ రెండు ఆడిట్‌ కంపెనీలకు ఈఎస్‌డీఎస్‌ అనే కంపెనీ డొమైన్‌ ప్రొవైడర్‌గా ఉంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో చాలా కంపెనీలు డొమైన్‌ను ఒక కంపెనీ ద్వారా హోస్ట్‌ను మరో చోట రిజిస్టర్‌ చేసుకుంటారు. ఈఎస్‌డీఎస్‌ డొమైన్‌ ప్రొవైడర్‌ అయినంత మాత్రాన ఈ కంపెనీల డేటా వీరి వద్దే ఉందనడానికి ఆధారాలు లేవు. కానీ, పచ్చ పత్రిక మాత్రం ఐపీ అడ్రస్‌లు, వాటి సాంకేతిక విషయాలను సరిగా అర్థం చేసుకోలేక వాస్తవ విరుద్ధంగా కథనాన్ని వండి వార్చింది.

టీడీపీ దగ్గర ఆ డేటా ఉందా?
పచ్చ పత్రిక స్క్రిప్టు రైటర్లు చంద్రబాబు స్కిల్‌ కాలేజీలో చదువుకున్నట్టున్నారు. అందుకే అజ్ఞానాన్ని బుర్ర నిండా నింపుకొన్నారు. చంద్రబాబు దగ్గరకు షెల్‌ కంపెనీల డబ్బులు వచ్చి చేరాయి కదా.. అదే విధంగా వేర్వేరు కంపెనీల్లోని ఐపీ అడ్రస్‌లలో కొన్ని అంకెలు ఒకేలా ఉండటంతో డేటా ఒకే చోటకు వెళ్లిపోతాయని ఆ పత్రిక అపోహపడింది. పచ్చ పత్రిక తెలు­గుదేశం పార్టీ వెబ్‌సైట్‌ ఐపీ అడ్రస్‌ను కూడా ఒక్కసారి చూస్తే విషయం బోధపడేది.

టీడీపీకి చెందిన Telugudesam.org వెబ్‌సైట్‌ ఐపీ అడ్రస్‌ 52.140.106.225. దీనిని అమెరికాలోని ఆరిజోనాలో ఉన్న  GoDaddy. com అనే సంస్థ అందించింది. ఈ సంస్థ ఒక్క తెలుగుదేశం పార్టీకే కాదు మరో 254 కంపెనీల వెబ్‌సైట్లకు హోస్టుగా ఉంది. వీటి అన్నింటికీ డొమైన్‌ 52.140.106 ఒకేలా ఉంటుంది. పచ్చ పత్రిక చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కూడా  GoDaddy. com ఐపీ అడ్రస్‌ క్రియేట్‌ చేసిన 254 కంపెనీల డేటాను యాక్సెస్‌ చేస్తుండాలి. లే­క ఆ సర్వర్లు టీడీపీ కంట్రోల్‌లో ఉండి ఉండాలి. 

Advertisement
 
Advertisement