
సాక్షి, చెన్నై: కుశస్థలి నదిపై డ్యాంల నిర్మాణం చేపట్టవ ద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ఈమేరకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. కుశస్థలి నది ఆంధ్రప్రదేశ్‌లో 877 చదరపు కిలో మీటర్లు, తమిళనాడులో 2,850 చదరపు కిలోమీటర్లు ప్రవహిస్తోందని లేఖలో వివరించారు. పూండి రిజర్వాయర్‌కు ఈ నది నీరే ఆధారమని, ఈ నీళ్లే చెన్నై వాసుల దాహార్తిని తీరుస్తున్నాయని అందులో పేర్కొన్నారు.
కుశస్థలిలో నీటిని అడ్డుకునే విధంగా చిత్తూరు జిల్లాలో రెండు డ్యాంలు నిర్మించేందుకు ఏపీ అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. తమకు రావాల్సిన నీటిని అడ్డుకునేలా అక్కడి అధికారులు చేపట్టిన చర్యలను నిలిపివేయించి, డ్యాంల నిర్మాణాన్ని ఆదిలోనే ఆపివేయాలని ఆ లేఖలో తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు.