PM Modi Wishes On CM YS Jagan Mohan Reddy Birth Day - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

Dec 21 2020 7:56 AM | Updated on Jun 29 2022 2:01 PM

PM Modi Wishes On CM YS Jagan Mohan Reddy Birth Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు,  వైఎస్సార్‌ సీపీ నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సహా పలువులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement