మహిళలే టార్గెట్‌ | Man Arrested For Morphing Photos | Sakshi
Sakshi News home page

మహిళలే టార్గెట్‌

May 9 2026 6:26 AM | Updated on May 9 2026 6:26 AM

 Man Arrested For Morphing Photos

 5 వేల వీడియోలు.. 10 వేలకుపైగా ఫొటోలు మార్ఫింగ్‌ 

పోలీసుల అదుపులో కంప్యూటర్‌ ఆపరేటర్‌ 

హుస్నాబాద్‌: మహిళల ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తున్న ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని హుస్నాబాద్‌ విద్యుత్‌ శాఖ డీఈ కార్యాయలంలో హనుమకొండ జిల్లా ఎర్రబెల్లికి చెందిన మహేశ్‌ 12 ఏళ్లుగా ఆర్టీజన్‌గా పనిచేస్తున్నాడు. వారం క్రితం మహేశ్‌.. తన కంప్యూటర్‌ పనిచేయట్లేదంటూ తోటి మహిళా ఉద్యోగి కంప్యూటర్‌లో తన వాట్సాప్‌ వెబ్‌ను లింక్‌ చేసుకున్నాడు.

అయితే వాట్సాప్‌ వెబ్‌ను లాగవుట్‌ చేయడం మరిచిపోయాడు. తర్వాత ఆ మహిళా ఉద్యోగి వాట్సాప్‌ వెబ్‌ను చూడగా తన ఫొటోతోపాటు ఆఫీసులోని మిగతా మహిళల మార్ఫింగ్‌ ఫొటోలు ఉన్నట్లు గుర్తించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహేశ్‌ వినియోగిస్తున్న ఆఫీస్, ఇంట్లోని కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ఇంట్లోని కంప్యూటర్‌లో దాదాపు 5 వేల వరకు వీడియోలు, 10 వేలకుపైగా మార్ఫింగ్‌ ఫొటోలు ఉన్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement