ఆకివీడు రామాలయ అనుమతులపై పిటిషన్‌ | Andhra Pradesh High Court Hearing On Akividu Ramalayam Construction | Sakshi
Sakshi News home page

ఆకివీడు రామాలయ అనుమతులపై పిటిషన్‌

May 5 2026 5:04 AM | Updated on May 5 2026 5:04 AM

Andhra Pradesh High Court Hearing On Akividu Ramalayam Construction

నేడు విచారిస్తామన్న హైకోర్టు  

సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో రామాలయ నిర్మా­ణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ స్థానికులు వంగా జ్యోత్స్న, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లే­దని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని, అయినా అధికారులు రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని వివరించారు.

ఈ వ్యాజ్యం గురించి పిటిషనర్ల తరఫు న్యాయ­­వాది జడా శ్రవణ్‌ కుమార్‌ సోమవా­రం ఉద­యం న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ముందు ప్రస్తావించారు. లంచ్‌మోషన్‌ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. స్పందించిన న్యాయమూర్తి మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement