
వచ్చే సీజన్ నాటికి ఈ సమస్య పరిష్కారం కావాలి
అధికారులకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదేశం
పోలవరం ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో పరిశీలన
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో సీపేజీ (ఊట నీరు) సమస్యపై ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదేశించింది. వచ్చే సీజన్ నాటికి సీపేజీ సమస్య పరిష్కారం కావాలని సూచించింది. సియాన్ హించ్‌బెర్గర్, మెస్సర్స్ సీ రిచర్డ్ డొన్నెళ్లి, గియానోఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్ పాల్‌లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జల్‌శక్తి డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ భక్షి, డైరెక్టర్(డిజైన్స్) రాకేష్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాంలతో కలిసి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
జలవనరుల శాఖ ఇంజినీర్–ఇన్–చీఫ్ నరసింహమూర్తి ప్రాజెక్టు పనులను పూర్తి వివరాలతో నిపుణుల కమిటీకి వివరించారు. అనంతరం, ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్ల (మేఘా, బావర్ ప్రతినిధులు)తో కలిసి కమిటీ సమావేశం జరిగింది. ప్రధాన డ్యాం గ్యాప్–1 నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లతో మోడల్ డ్యాం నిర్మించాలన్న గత సూచన అమలు చేయకపోవడాన్ని కమిటీ ఆక్షేపించింది. వర్షాల వల్ల నిరి్మంచలేకపోయామని అధికారులు వివరించారు.
ప్రధాన సూచనలు:
» ప్రధాన డ్యాం గ్యాప్–1, గ్యాప్–2ల మధ్య జీ–హిల్‌ను క్షేత్ర స్థాయి పరిస్థితుల ఆధారంగా తగ్గించాలని సూచన.
» గ్యాప్–1 ప్రాంతంలో వరదల వల్ల ఏర్ప డిన అగాధాలను 25 మీటర్ల వరకు రాళ్లతో నింపి, ప్రాథమిక పనులు ప్రారంభించాలి.