ఐచర్‌ ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఐచర్‌ ఢీకొని యువకుడి మృతి

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

రాప్తాడు రూరల్‌: మండల పరిధిలోని రామినేపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కనగానపల్లికి చెందిన పూజరి ఉజ్జినప్ప కుమారుడు రంజిత్‌ (25) బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. వ్యవసాయ పంట పొలాలకు అవసరమైన మందుల కోసం స్నేహితుడు ప్రసాద్‌తో కలిసి అనంతపురం వచ్చారు. అనంతరం ఇద్దరూ బైకుపై స్వగ్రామానికి బయలుదేరారు. రామినేపల్లి వద్ద జాతీయ రహదారి నుంచి కుడివైపు సర్వీస్‌ రోడ్డుకు వెళ్తుండగా బెంగళూరు వైపు నుంచి వచ్చిన ఐచర్‌ వాహనం అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రంజిత్‌ తీవ్రంగా గాయపడగా, ప్రసాద్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ రంజిత్‌ మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement