పెద్దవడుగూరు: మండలంలోని రీసర్వే పనులను వేగంగా, పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అప్పేచర్ల, క్రిష్టిపాడు గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే చేసే సమయంలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దవడుగూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పట్టాదారు పాసుపుస్తకం అందించడంలో అధికారుల తీరుపై రైతులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉషారాణి, సర్వేయర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


