● కొత్త మద్యం పాలసీ వచ్చాక విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు ● కల్తీ మద్యంతోనే అనారోగ్యం పాలు ● నవోదయం 2.0 సదస్సులోఎకై ్సజ్ అధికారులను నిలదీసిన మత్స్యకారులు
ఎస్.రాయవరం: మండలంలో మత్స్యకార గ్రామా ల్లో కల్తీ మద్యం ఏరులై పారుతోందని గ్రామస్తులు ఎకై జ్ పోలీసులకు ముక్తకఠంతో తెలిపారు. పాయకరావుపేట ఎకై ్సజ్ పోలీసులు రేవుపోలవరం, బంగారమ్మపాలెం గ్రామాల్లో గురువారం నవోదయం–2.0 అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సారా తయారీ, గంజాయి రవాణా, అమ్మకాలు చట్టరీత్యా నేరం అని చెప్పారు. సారా, గంజాయి సేవించడం వల్ల గుండె జబ్బులు, నోరు, లివర్, ప్రేగు క్యాన్సర్ కడుపులో మంట వంటి జబ్బులు వస్తాయని తెలిపారు. ఇది విన్న గ్రామస్తులు ఎకై ్సజ్ పోలీసులను ఎదురు ప్రశ్నించడం మొదలు పెట్టారు. అయిదు వేల నుంచి 10 వేల జనాభా ఉండే మా గ్రామాల్లో కల్తీమద్యం పెద్ద ఎత్తున విక్రయిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఎవరైనా తెగించి ఫిర్యాదు చేస్తే వారిళ్లపైకి అక్రమ మద్యం అమ్మేవారు దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలోనే నయం..
గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఉండేదని, దానిద్వారా నాణ్యమైన మద్యం సరఫరా అయ్యేదని, ఇప్పుడు దుకాణం తొలగించి గుడివాడకు మార్చి బెల్టు దుకాణాలకు తెర తీశారన్నారు. గ్రామంలో సుమారు 100కు పైగా మద్యం బెల్టు దుకాణాలు ఉన్నాయని ఎకై ్సజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా లైసెన్స్ దుకాణాల సిబ్బంది ప్రతి రోజూ ఇంటింటికీ పంచినట్టు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం సరఫరా చేసి వెళ్తున్నారని చెప్పారు. అలా పంపిణీ చేసి విక్రయిస్తున్న మద్యం పూర్తి కల్తీగా ఉంటుందని, అది తాగి పలువురు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ అనుమతితో కూడిన మద్యం దుకాణం మాత్రమే ఏర్పాటు చేయాలని, అక్రమ మద్యాన్ని అరికట్టాలని అన్నారు. ఇదే పరిస్థితి బంగారమ్మపాలెంలోనూ ఉందని, ఎకై ్సజ్ పోలీసులు, సివిల్ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో గ్రామస్తుల ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఎకై ్సజ్ పోలీసులు వారికి తెలిపారు. సమావేశంలో సర్పంచ్ మల్లే లోవరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, గ్రామస్తులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.