తుది విడత చందనం అరగదీత ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తుది విడత చందనం అరగదీత ప్రారంభం

Jul 6 2025 6:49 AM | Updated on Jul 6 2025 6:49 AM

తుది విడత చందనం అరగదీత ప్రారంభం

తుది విడత చందనం అరగదీత ప్రారంభం

సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం నుంచి తుదివిడత చందనం అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీన ఆషాఢ పౌర్ణమిని పురస్కరించు కుని స్వామివారికి సమర్పించనున్న మూడు మ ణుగుల (సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సిద్ధం చేసేందుకు ఈ అరగదీత చేపట్టారు. ఉదయం చందనం చెక్కలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 15 మంది నాలుగో తరగతి సిబ్బంది 36 కిలోల చందనాన్ని అరగదీశారు. మరో రెండు రోజుల పాటు ఈ చందనం అరగదీత కొనసాగనుంది. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, సూపరింటెండెంట్‌ వెంకటరమణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement