
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన
రంపచోడవరం: గిరిజన విద్యార్థులకు అర్ధమైయ్యే రీతిలో బోధించాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అధికారులను ఆదేశించారు. మండలంలోని బందపల్లి ఆశ్రమ పాఠశాలను పీవో శనివారం సందర్శించారు. విద్యార్ధులతో మాట్లాడి పాఠశాలలో వారికి అందుతున్న సౌకర్యాలు, బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు, నోట్ బుక్స్ విద్యార్థులకు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వెండర్లు కోడి మాంసం, పాలు, గుడ్లు సక్రమంగా సరఫరా చేస్తున్నారో లేదా తెలుసుకున్నారు. విద్యార్థులకు అనారోగ్యమైతే తక్షణమే వైద్య సేవలందించాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. చిన్నారులకు ఆట పాటలతో బోధన చేసి పాఠశాలకు సిద్ధం చేయాలన్నారు. సీతపల్లి ఎంపీపీ పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం సమక్రంగా అమలు చేయాలన్నారు.
విద్యార్థుల సామర్థ్యాలపై పూర్తి పర్యవేక్షణ :
ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీడీ రుక్మాండయ్య అన్నారు. మారేడుమిల్లి, రంపచోడవరం మండలాల్లో తాడేపల్లి, బూసిగూడెం ఆశ్రమ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు బేస్ లైన్ టెస్టు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్ధికి నాణ్యమై/న విద్య అందించే విధంగా ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. నిబంధనలు ప్రకారం మెను అమలు చేయాలన్నారు.
ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన