
ఘనంగా జగన్నాథుని తిరుగు యాత్ర
బీచ్‌రోడ్డు: ఉత్కళ్ సంస్కృతి సమాజ్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ముగింపు వేడుక శనివారం అత్యంత వైభవంగా జరిగింది. తొమ్మిది రోజుల కిందట లాసన్స్‌బే కాలనీలోని గుండిచా ఆలయానికి వెళ్లిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి తిరిగి దసపల్లాలోని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. ఈ ఊరేగింపులో ఒడిస్సీ, కూచిపూడి నృత్యాలు, ఒడిశాకు కళాకారుల ‘థింసా’నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన ఆలయానికి చేరుకున్నాక.. లక్ష్మీదేవిని శాంతిపజేయడానికి జగన్నాథుడు రసగుల్లాలు సమర్పించే సంప్రదాయాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో సుమారు 3,000 మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. సమాజ్ అధ్యక్షుడు జె.కె. నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జగన్నాథుని తిరుగు యాత్ర