
బల్లిగిరికి పోటెత్తిన భక్తులు
అల్లిపురం (విశాఖ): ఆషాడ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం బల్లిగిరి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారు జాము నుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకుడు గొడవర్తి రఘునాథాచార్యులు స్వామిని చందనంతో విశేషంగా అలంకరించారు. స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆలయ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను నూతనంగా భక్తుల సహకారంతో తయారు చేసిన మండపంలో ఏర్పాటు చేసి భక్తుల గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్త బృందాలు స్వామికి పండ్లు, పూలు, పిండి పదార్థాలు నివేదన చేసి విష్ణు సహస్ర నామాభిషేకాలు చేశారు. సాయంత్రం దేవస్థానం ఆవరణలో గల ధ్వజస్తంభం వద్ద మహిళలు ప్రత్యేకంగా దీపాలంకరణ చేసి పూజలు చేశారు.

బల్లిగిరికి పోటెత్తిన భక్తులు