
గేదెల మందను ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
రాజవొమ్మంగి: రాజవొమ్మంగికి చెందిన లింగం రాజుబాబు మోటారుసైకిల్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా గేదెలు అడ్డురావడంతో ఢీకొని ఆదివారం రాత్రి తీవ్రంగా గాయపడ్డాడు. రాజుబాబు దోమల మందు పిచికారీ పనుల నిమిత్తం మండలంలోని ఏ.బి.కాలనీ గ్రామానికి వెళ్లి పనులు పూర్తి చేసుకొని బైక్‌పై తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. మార్గమధ్యలో చీకటిలో రోడ్డుపై గేదెల మంద అడ్డురావడంతో వాహనం అదుపుతప్పడంతో రాజుబాబు వాటిని బలంగా ఢీ కొట్టి పడిపోయాడు. అతనిని సహచర కూలీలు జడ్డంగి పీహెచ్‌సీకు, ఆ తరువాత రాజవొమ్మంగి పీహెచ్‌సీకు తరలించారు. స్థానిక వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలేశ్వరం సీహెచ్‌సీకు తరలించారు.