
బీఎల్‌వోలకు శిక్షణ
రంపచోడవరం: రంపచోడవరం నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఆఫీసర్ల ఎన్నికల జాబితా నిర్వహణపై శిక్షణ ఎప్పటికప్పుడు కొనసాగుతుందని రంపచోడవరం సబ్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అన్నారు. ఈ శిక్షణ భారత ఎన్నికల సంఘంకు అనుబంధ సంస్ధ అయిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. ఇందులో భాగంగా రెండో శిక్షణలో 50 మంది చొప్పున తొమ్మిది బ్యాచ్‌లుగా 399 మందికి శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎలక్షన్ డీటీఆర్ సునీత, మాస్టర్ ట్రైనర్ సుధాప్రకాష్‌లు శిక్షణ ఇచ్చారు.