అందుబాటులో ఉన్న పుస్తకాలతో..
పాఠశాల విధులు నిర్వహిస్తూనే అందుబాటులో ఉన్నా పుస్తకాలు చదువుతున్నా. టెట్ రాసేందుకు అనుకున్నంత సమయం లేకుండాపోయింది. నిన్నటి వరకు ఎన్నికల విధులు నిర్వహించాం. ఇటూ ప్రిపేర్ కావడం ఆందోళనగా ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులరాలుగా 31 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేశాను. ఇప్పుడు ఎగ్జామ్ రాయమనడం అన్యాయం. గణితం ఉపాధ్యాయులు హిందీ, హిందీ టీచర్లు సోషల్ రాయమనడం అంతా గజబీజీగా ఉంది. టెట్ తప్పనిసరి నిబంధన సమంజసంగా లేదు.
– శారా సంగీత, జీహెచ్‌ఎస్, పాత మంచిర్యాల


