ఆర్జీయూకేటీ విద్యార్థునులకు ప్రిన్స్‌టన్ స్కాలర్‌షిప్
బాసర:ప్రతిభావంతమైన విద్యార్థినులకు విద్యాసాధికారత కల్పించేందుకు ప్రిన్స్‌టన్ ఫౌండేషన్ ఏటా ఉపకారవేతనాల అందిస్తోంది. ఈఏ డాది ఉపకార వేతనాలు ఆర్జీయూకేటీ విద్యార్థినులు స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. ఇన్‌చార్జి వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ ఈ స్కాలర్‌షిప్ విద్యార్థినులకు ఆర్థిక సహాయం, ఇంటర్న్‌షిప్, మెంటరింగ్‌తో ఉన్నత విద్యలో అవకాశాలు కల్పిస్తాయని వివరించారు. ఇది కళాశాలలో విద్యార్థినుల సాధికారత, విద్యా నిబద్ధతకు నిదర్శనమని అన్నా రు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లడుతూ విద్యార్థులు అకడమిక్ రంగంలో కఠిన శ్రమ, క్రమశిక్షణ, శ్రద్ధ చూపుతున్నారన్నారు. తాజా ఎంపికే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, జేఎన్‌యూ, శ్రీరామ్ కామర్స్ కాలేజీల విద్యార్థినులతో ఆర్జీయూకేటీ విద్యార్థినులు పోటీపడ్డారని వివరించారు. స్కాలర్‌షిప్‌నకు ఎంపికై న విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్‌లు ఎస్.విఠల్, మహేశ్, శేఖర్, ఉపకార వేతన కార్యాలయ సిబ్బంది జి.శ్వేత, చిన్నారెడ్డి, హిమబిందు, వినోద్ పాల్గొన్నారు.


