నాడు పతులు.. నేడు సతులు
ఆసిఫాబాద్‌రూరల్: ఆసిఫాబాద్ మండలంలో పలువురు గతంలో సర్పంచులుగా పనిచేయగా.. ప్రస్తుతం వారి సతీమణులు ఆ పదవులు చేపట్టనున్నారు. 2019లో ఎల్లారం పంచాయతీ సర్పంచ్‌గా సీతారాం ఎన్నికయ్యారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఈసారి ఆయన భార్య నీలబాయిని ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కౌటగూడలో 2019లో లక్ష్మీనారాయణ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈసారి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ రావడంతో భార్య స్వప్పను బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో నిలపగా ఆమె విజయం సాధించారు. పాడిబండ పంచాయతీలో గతంలో దినకర్ సర్పంచ్‌గా ఎన్నిక కాగా, ఈసారి ఎస్టీ మహిళ రిజర్వేషన్‌తో అతడి భార్య ఈశ్వరీ విజయం సాధించారు. గుండిలో పంచాయతీలో మాత్రం 2019లో అరుణ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీసీ పురుషులకు రిజర్వేషన్ రావడంతో ఆమె భర్త రవీందర్ బరిలోకి దిగి ఏడు ఓట్లతో గెలుపొందారు.
నాడు పతులు.. నేడు సతులు
నాడు పతులు.. నేడు సతులు
నాడు పతులు.. నేడు సతులు
నాడు పతులు.. నేడు సతులు


