పట్టభద్రులకే ‘పట్టం’...!
తాండూర్: తాండూర్ మండలంలోని 15గ్రామ పంచాయతీల్లో ఓట ర్లు పలువురు పట్టభద్రులకే పట్టం కట్టారు. మండలంలోని ద్వారకాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై న మాసాడి తిరుపతి ఎంకాంలో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో 89ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. బోయపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన సుందిళ్ల శంకరమ్మ గృహిణిగానే తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె కూడా బీఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 148ఓట్ల మె జార్టీతో ఎన్నికల్లో విజయం సాధించారు. కాసిపేట సర్పంచ్‌గా ఎన్నికై న ము దాం వనజ సైతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గృహిణిగా తన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మండలంలోనే అత్యధికంగా 805ఓట్ల భారీ మెజార్టీ తో విజయాన్ని కై వసం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు సర్పంచ్‌లు ఇంటర్మీడియెట్, మరో ఐదుగురు పదో తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.
పట్టభద్రులకే ‘పట్టం’...!
పట్టభద్రులకే ‘పట్టం’...!


