రెండు బైక్‌లు ఢీ
కాసిపేట: మండల కేంద్రంలోని కాసిపేట పెట్రోల్‌బంక్ కోమటిచేను శివారు ప్రాంతంలో రహదారిపై గురువారం సాయంత్రం ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని 108అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలపై వేగంగా వచ్చి ఢీకొన్నారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను అంబులెన్స్‌లో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మృతి చెందగా, మరొకరు విషమంగా ఉన్నట్లు 108అంబులెన్స్ ఈఎంటీ నరేష్, పైలెట్ పాషాలు తెలిపారు. మృతుడు మందమర్రి మండలం క్యాతన్‌పల్లికి చెందిన దురిశెట్టి హరిప్రసాద్(26)గా, విషమంగా ఉన్న వ్యక్తి మందమర్రి శ్రీపతినగర్‌కు చెందిన రమేశ్‌గా గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.


