సర్వేకు సహకరించాలి
ఆదిలాబాద్‌టౌన్: కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో ఈనెల 18 నుంచి 31వరకు కుష్ఠు సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పట్టణ ఆ రోగ్యకేంద్రంలో వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్య మాన్ని ప్రారంభించి మాట్లాడారు. 2027నాటి కి భారత్‌ను కుష్టురహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కుష్టు రోగులను గుర్తించేందు కు నిర్వహిస్తున్న ఈ సర్వేలో భాగంగా ప్రజలు తమ ఇళ్లకు వచ్చే ఆశ కార్యకర్తలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. శరీరంపై పాలిపోయిన, రాగి రంగు మొద్దుబారిన మచ్చలు కనిపిస్తే కుష్టుగా అనుమానించాల్సిన అవసరముందని తెలిపారు. ఆశ కార్యకర్తలు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, సూపర్‌వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించా లని ఆదేశించారు. ప్రోగ్రాం ఆఫీసర్ శిరీన్, వై ద్యాధికారి సౌమ్య, డీపీఎంవోలు వామన్‌రావు, రమేశ్, ఎల్టీలు నిజామొద్దీన్, సంతోష్, సీవో రాజారెడ్డి, ఆశ కార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు.


