సమన్వయంతో పనిచేయాలి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌ను విజయవంతం చేసేందుకు కమిటీ బాధ్యులంతా సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో ఎస్.రాజేశ్వర్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న సైన్స్‌ఫేర్, ఇన్‌స్పైర్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించా రు. కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనా త్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలకు దోహదపడే సైన్స్‌ఫేర్‌ను నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని వివిధ కమిటీల బాధ్యులకు సూచించారు. జిల్లా సైన్స్ అధికారి భాస్కర్, వివిధ కమిటీల కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు.


