మరోసారి పత్తి ధరలో కోత
ఆదిలాబాద్‌టౌన్: నాణ్యత తగ్గిందని మరోసారి పత్తి ధరలో కోత విధించేందుకు సీసీఐ రంగం సి ద్ధం చేసింది. గతనెల 27నుంచి క్వింటాల్‌కు రూ.50 తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రూ.50 తగ్గిస్తూ ఈనెల 22నుంచి అమలు చేసేందు కు నిర్ణయం తీసుకుంది. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే పత్తికి గిట్టుబాటు ధ ర లేదని రైతులు ఆందోళన చెందుతుండగా ప్రభుత్వరంగ సంస్థ తీసుకున్న నిర్ణయంతో వారు దిగా లు చెందుతున్నారు. పత్తి నాణ్యతలో ప్రమాణాలు తగ్గాయని బీబీ స్పెషల్ నుంచి మెక్‌మోడ్‌కు మారిందని సీసీఐ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.8,060 ఉండగా, ఈనెల నుంచి నుంచి మద్దతు ధరలో రూ.50 తగ్గనుంది. దీంతో సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,010 చెల్లించేందుకు నిర్ణయించింది. పత్తి క్వింటాల్ మద్దతు ధర రూ.8,110 ఉండగా, గత నెలరోజుల్లోనే రూ.100 తగ్గించారు. తేమ పేరిట కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసిన సీసీఐ మరోసారి ధర రూ.50 తగ్గించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
7.33లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు
జిల్లాలో ఐదు మార్కెట్ యార్డులున్నాయి. వీటి పరి ధిలో 7లక్షల 33వేల 763 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఇందులో సీసీఐ 7లక్షల 3వేల 763 క్వింటా ళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు 30 వే ల క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పత్తి పంట దెబ్బతింది. సీసీఐకి విక్రయించిన చాలామంది రైతులకు మద్ద తు ధర లభించలేదు. తేమ పేరిట ధర తగ్గించడంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొంత మంది రైతులకు సంబంధించిన పత్తిని తేమ పేరిట కొనుగోలుకు నిరాకరించడంతో గత్యంతరం లేక వారు ప్రైవేట్‌కు తక్కువ ధరకే విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇదివరకే రూ.50 కోత విధించగా, మరోసారి కోత విధించేందుకు నిర్ణయం తీసుకోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇప్పటివరకు కొనుగోలు చేసింది
7,33,763 క్వింటాళ్లు
సీసీఐ కొనుగోలు చేసింది 7,03,763 క్వింటాళ్లు
ప్రైవేట్ కొనుగోలు చేసింది 30వేల క్వింటాళ్లు
ప్రస్తుత మద్దతు ధర రూ.8,060
22నుంచి అమలులోకి రానున్న ధర రూ.8,010


