పల్లె పోరు.. యువత జోరు
కై లాస్‌నగర్: దాదాపు రెండేళ్లుగా ఎదురుచూసిన పంచాయతీ ఎన్నికలు ముగి శాయి. మూడు విడతలుగా జరిగిన ఎ న్నికల్లో పల్లె ఓటర్లు పంచాయతీ పాలకులను ఎన్నుకున్నారు. అయితే ఈ ఎ న్నికల బరిలో నిలిచిన యువతకు ఓట ర్లు అగ్రతాంబూలం ఇచ్చారు. తమ తీర్పుద్వారా వారికి పెద్దపీట వేశారు. మెజార్టీ గ్రామాల్లో యువతనే తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. ఈ పరి ణామం రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలు కుతోంది. రాజకీయాలపై యువత ధోరణిలో వస్తు న్న మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. మరో వై పు ప్రజలు కూడా నవతరాన్ని రాజకీయాల్లోకి ఆ హ్వానిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో పలువు రు అభ్యర్థులు తొలిప్రయత్నంలో విజయబావుటా ఎగరేసి పల్లెపాలన పగ్గాలు అందుకోవడం విశేషం.
తొలిమెట్టు సర్పంచ్..
రాజకీయాల్లో రాణించేందుకు సర్పంచ్ పదవిని అంతా తొలిమెట్టుగా భావిస్తుంటారు. ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో రాణించిన, ప్ర స్తుతం ఆయా పదవుల్లో కొనసాగుతున్న వారిలో ఎంతోమంది ఇలా సర్పంచులుగా సేవలందించినవారే. అలాంటి సర్పంచ్ పదవులపై యువత ప్ర త్యేక దృష్టి సారించింది. రాజకీయాలంటేనే అంతగా ఆసక్తి చూపని వారు ఈసారి పోటీకి జై కొట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన యువతరం తమ ఊరి బాగుకోసం ముందడుగు వేసింది. నిత్యం ఊరిలో, ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి దృష్టి సారించారు. కష్టసుఖాల్లో తోడుగా నిలిచారు. పోటీకి దిగిన తొలి ప్రయత్నంలోనే ప్రజల మెప్పు పొంది ఊరి సర్పంచులుగా వి జయం సాధించారు. సర్పంచ్ సాబ్.. అని పిలిపించుకుంటున్నారు. అత్యధిక గ్రామాల్లో 25 నుంచి 35 ఏళ్లలోపు యువతీయువకులు సర్పంచులుగా ఎన్ని క కావడం రాజకీయాలపై యువతలో వస్తున్న మా ర్పునకు నాందిగా నిలుస్తోంది. డబ్బుతో ముడిపడి న ప్రస్తుత రాజకీయాల్లో చేతి చమురు వదిలించుకుంటేనే గాని పదవి దక్కదనే భావన పూర్తిగా వ్యతి రేకమని నిరూపించారు. గ్రామంలో పట్టు పెంచుకునేలా ప్రజలకు చేదోడు.. వాదోడుగా నిలిస్తే విజ యం అసాధ్యమేమి కాదని తమ గెలుపుతో సత్తా చాటారు. ఇదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరింత మంది యూ త్ పోటీ పడే అవకాశం లేకపోలేదు. ఇది మంచి రాజకీయ పరిణామంగా చెప్పవచ్చు.
పాలనపై సర్వత్రా ఆసక్తి..
రాజకీయాల్లోకి కొత్తగా అడుగిడి ఎన్నికల్లో అంతగా ఖర్చు చేయకున్నా చాలామంది యువతీయువకులు ఈసారి సర్పంచులుగా ఎన్నికయ్యారు. వారి కు టుంబాలకూ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అంతగా లే దు. ఇందులో స్వతంత్రులూ ఎక్కువ మందే ఉన్నా రు. అలాంటి వారు పల్లె పాలనలో ఎలాంటి ముద్ర వేస్తారనేదానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తమపై నమ్మకముంచి గెలిపించిన ప్రజల మన్ననలను పొందేలా పరిపాలిస్తామని పలువురు యువ సర్పంచులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


