నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉందని, నూతన సర్పంచులు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, సభలు, ఊరేగింపులు నిర్వహించరాదని తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలపై బోథ్, బజార్‌హత్నూర్ మండలాల్లో 11 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బోథ్ మండలం ధన్నూర్(బీ)లో 40 బాటిళ్ల మద్యం తరలిస్తున్న సామ ప్రవీణ్‌రెడ్డి, సామ సా యికిరణ్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓ అభ్యర్థికి అనుకూలంగా ఓటర్లకు రూ.500 నగ దు, బ్యాలెట్ పత్రం అందజేసిన గొర్ల గంగయ్య, లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బోథ్‌లో ఎండీ జుబేర్ నుంచి ఒక ఫుల్‌బాటిల్ మద్యం, రూ.6,730 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సొనాల మండలం గుట్టపక్కతండాకు చెందిన పలువురు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించడంతో సుభా ష్‌తో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కౌట(బీ) గ్రామంలో రోడ్డు పక్కన మద్యం సేవించిన రమణయ్య, ఒరగంటి రాజు, దీకొండ ముఖేశ్‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిగిని గ్రామంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థికి అనుకూలంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన నితిన్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కౌట(బీ) గ్రామానికి చెందిన నిందితుడు కొండల జైపాల్ మద్యం సేవించి ఓటు వేసి బ్యాలె ట్ పేపర్‌ను చించినట్లు తెలిపారు. ప్రిసైడింగ్ అధి కారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పే ర్కొన్నారు. కౌట(కే)లో ఎన్నికలు పూర్తయిన తర్వా త బ్యాలెట్ బాక్సులతో తిరిగి వెళ్తున్న మొబైల్ పార్టీ ని అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించిన ఎం. రాజేశ్వర్, ఉత్తమ్, కె.రాజేశ్వర్, వెంకటి, పంచపూలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సొనాల మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన గెలిచిన అభ్యర్థి అనుచరులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. బజార్‌హత్నూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదైనట్లు తెలిపారు. చందునాయక్‌తండాలో ఓటు వేసి ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు ఇ బ్బందులు కలిగించిన రాబ్డే సురేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదే పోలింగ్ కేంద్రంలో 100, 200 మీటర్ల పరిధిలో గుమిగూడిన రవీందర్, రాజేందర్, ప్రకాశ్, కై లాశ్, సుభాష్, చౌహాన్ రవి, కవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు.


