అక్రమ కేసులతో వేధిస్తున్న కేంద్రం
ఆదిలాబాద్: గాంధీ కుటుంబాన్ని వేధించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో ఇ బ్బందులకు గురి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం బీజేపీ కార్యాలయం ఎదుట నిరస న తెలిపారు. నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు నాయకులు, పోలీసుల మ ధ్య తోపులాట జరిగింది. అనంతరం నరేశ్ జాదవ్ మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో పదేళ్లుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కోర్టు కూడా దీనిని తప్పు పట్టిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతి పక్షాలను అణిచివేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ ఎంపీ సోయం బాపూరావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, గుడిహత్నూర్ మండలాధ్యక్షుడు మల్యాల క రుణాకర్, టౌన్ అధ్యక్షుడు గుడిపెల్లి నగేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్‌గౌడ్ పాల్గొన్నారు.


