క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్
ఆదిలాబాద్‌టౌన్: మహిళలు, యువతుల్లో సర్వేకల్ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తుందని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సమావేశ మందిరంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై వైద్యాధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవనశైలిలో మార్పులు, వివిధ రుగ్మతలతో మహిళలు, యువతులు సర్వేకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. 14 ఏళ్లలోపు బాలికలు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రతీ పీహెచ్‌సీలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈనెల 18 నుంచి 31 వరకు కుష్ఠు వ్యాధి గుర్తింపు ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌వో సాధన, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, వైద్యాధికారులు పాల్గొన్నారు.


