ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
ఆదిలాబాద్‌టౌన్: లేబర్‌కోడ్‌ల రద్దు కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. యూనియన్ 18వ మహాసభల సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కార్మిక పోరాట పతాక జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలంటే ఐక్య పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న అఖిల భారత మహాసభల్లో దేశ నలు మూలల నుంచి కార్మిక ప్రతినిధులు పాల్గొని కార్మిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చిస్తారని తెలిపారు. ఈ మహాసభలను వి జయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆశన్న, నాయకులు స్వా మి, నవీన్‌కుమార్, మల్లేశ్, దేవిదాస్, సురేందర్, దత్తాత్రి, మంజుల, గంగారాం, ఆశన్న, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


