breaking news
World Emoji Day
-
సరదా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత కూడా..!
కాస్త సరదా కోసం’ అన్నట్లుగా కనిపించే ఇమోజీలు ఇప్పుడు సామాజిక విషయాలపై కూడా దృష్టి పెడుతున్నాయి.స్త్రీ సాధికారత, శక్తికి పెద్ద పీట వేస్తున్నాయి...‘వంద మాటలేల... ఒక ఇమోజీ చాలదా!’ అనుకోవడం వల్ల ఇమోజీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. వరల్డ్ ఆన్లైన్ పాపులేషన్లో 90 శాతం మంది ఇమోజీలను ఉపయోగిస్తున్నారు. సరదా సమయాలలో, భావోద్వేగ ప్రతీకలుగా ఉపయోగించే ఇమోజీలను స్త్రీ సాధికారత, శక్తిని ప్రతిబింబించే ప్రతీకలుగా తీర్చిదిద్దే ధోరణి పెరిగింది.‘వైవిధ్యమైన కెరీర్లో మహిళలు’ అనే అంశాన్ని ప్రతిబింబించేలా ఇమోజీలు వచ్చాయి. స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బోట్ రైడింగ్... ఇలా వివిధ ఆటల్లో మహిళల శక్తిసామర్థ్యాలను ప్రతిఫలించే ఇమోజీలు వచ్చాయి. ‘స్టెమ్’ కెరీర్లలో రాణించడానికి అమ్మాయిలకు కావాల్సింది ఏమిటి? అని చెప్పే ఇమోజీలు, సాంకేతికరంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు అని చెప్పే ఇమోజీలు వచ్చాయి.మహిళల సమస్యలను ప్రతిబింబించే ఇమోజీలు...కరోనా కల్లోల సమయంలో స్త్రీలపై ఒత్తిడి, గృహహింస బాగా పెరిగింది. సంస్థలు, ఇతరుల నుంచి సహాయం తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న సమయం అది. ఆ కల్లోల పరిస్థితికి అద్దం పట్టేలా ‘వయొలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ గర్ల్స్’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో హెల్త్, సోషల్ కేర్ వర్కర్లుగా మహిళలు ముందు వరుసలో ఉండి పనిచేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా వృత్తి నిబద్ధత చాటుకున్నారు. వారి వృత్తి నిబద్ధత మాట ఎలా ఉన్నా వేతనాలు, నాయకత్వ స్థానాలకు సంబంధించి మహిళలపై వివక్ష కనిపించింది. ఈ సమస్యను గురించి చెప్పే ఇమోజీ... జెండర్ పే గ్యాప్.కోవిడ్ కాలంలో విద్యాసంస్థలు మూతపడడం వల్ల చాలామంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లారు. అయితే సరైన సదు΄ాయాలు లేక΄ోవడం, పేదరికం వల్ల అబ్బాయిలతో ΄ోల్చితే అమ్మాయిలు ఆన్లైన్ ఎడ్యుకేషన్‌లో వెనకబడి΄ోయారు. దీని గురించి చెప్పే ఇమోజీ... డిజిటల్ జెండర్ డివైడ్. కోవిడ్ కల్లోలం మహిళల ఆదాయం, జీవనోపాధిని బాగా దెబ్బతీసింది. ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా పోయింది. దీని గురించి చెప్పే ఇమోజీ... ఇన్ఫార్మల్ వర్క్ అండ్ ఇన్స్టేబిలిటీ.పీరియడ్స్‌కు సంబంధించి మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ‘పీరియడ్ పావర్టీ అండ్ స్టిగ్మా’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్లు ఇన్ఫెక్షన్, అనారోగ్యం బారిన పడ్డప్పటికీ ప్రాణభయంతో వెనకడుగు వేయలేదు. అయినప్పటికీ విధాన నిర్ణయాలలో వారికి తగిన ప్రాతినిధ్యం లభించలేదు. ఈ విషయాన్ని చెప్పే ఇమోజీ... అండర్ రిప్రెజెంటేషన్ యాజ్ లీడర్స్ ఇన్ హెల్త్.బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీటెక్నికల్ ఆర్గనైజేషన్ యూనికోడ్ కన్షార్టియం తొలిసారిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీని తీసుకువచ్చింది. ఇది ఇమోజీ లైబ్రరీలో భాగం అయింది. ట్విట్టర్(ఎక్స్)లాంటి సామాజిక మాధ్యమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాంటి సందర్భాలలో ప్రత్యేక ఇమోజీలు తీసుకువచ్చాయి.కొన్ని సంవత్సరాల క్రితం...‘పెళ్లికూతురు ఇమోజీలు తప్ప వివిధ వృత్తులకు సంబంధించిన మహిళల ఇమోజీలు కనిపించవు. ఇమోజీ ప్రపంచంలో లింగ వివక్ష కనిపిస్తుంది’ అనే విమర్శలు ఉండేవి. ఇలాంటి విమర్శల నేపథ్యంలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి, స్త్రీ సాధికారతకు అద్దం పట్టే ఇమోజీలకు పట్టం కట్టే ప్రయత్నం జరుగుతోంది. మార్పు మంచిదే కదా! (చదవండి: నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్‌లో రూ. 72 లక్షలు..) -
అలిగినా, బుంగమూతి పెట్టినా ‘ఎమోజీ’ ఉంటే చాలదూ : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
భాషతో సంబంధం లేదు. మన మనసులోని భావాల్ని, భావోద్వేగాల్ని ఇట్టే చెప్పేస్తాయి. చిన్న చిన్న బొమ్మలే విశ్వవ్యాప్త భాషగా అవతరించి డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను విప్లవాత్మకం చేశాయి. అలిగినా, సిగ్గుపడినా, బుంగమూతి పెట్టినా, నవ్వొచ్చినా, వెక్కిరించినా కోపం వచ్చినా, మనం ఎక్కడ, ఎలా ఉన్నా అవతలివాళ్లకి చెప్పాలంటే పిల్లల్ని నుంచి పెద్దల దాకా ఒకే ఒక్క సింగిల్ క్లిక్ ఎమోజీ. రోజుకు కొన్ని వందల కోట్ లఎమోజీలు షేర్ అవుతాయి. అంత పాపులర్ ఎమోజీ. ఈ రోజు ప్రపంచ ఎమోజి దినోత్సవం సందర్బంగా కొన్ని ఆసక్తికర విషయాలు.ప్రస్తుత టెక్ యుగంలో మెసేజ్‌లు, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్ , ముఖ్యంగా వాట్సాప్ దాకా సోషల్ మీడియాలో ఎమోజీ లేనిదే రోజు గడవదు. సంతోషం, ప్రేమ, అసూయ, బాధ, కోపం, ఆఖరికి జలుబు, జ్వరం ఇలా ఏదైనా సరే ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు.ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకొంటాము. ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని 2014లో ఎమోజిపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్ రూపొందించారు. 2002లో Apple Mac కోసం iCalను ప్రవేశపెట్టిన రోజును సూచిస్తూ iOSలోని క్యాలెండర్ ఎమోజి ఈ తేదీని ప్రదర్శిస్తున్నందున జూలై 17ని ఎంచుకున్నారట. అలాగే జపాన్ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్టీటీ డొకామో’లో పనిచేసిన షిగెటకా కురిటా అనే ఇంజినీర్ వీటిని రూపొందించాడని చెబుతుంటారు.షిగెటకా కురిటా 1990లలో "ఎమోజి" అనే పదాన్ని ఉపయోగించారట. "ఎమోజి" అనేది జపనీస్ ఇడియమ్. మరోవైపు ఎమోజీని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చిందనే మరో కథనం కూడా. 1862లో లింకన్ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల హావ భావాలు బాగా ఆకట్టు కున్నాయి. ముఖ్యంగా కన్నుగీటేది బాగా పాపులర్ అయ్యింది. అలా ఈ ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్న మాట. -
World Emoji Day: సరదా నుంచి సందేశం వరకు...
అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి... కోవిడ్ సమయంలో... మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్‌కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఇమోజీలు తీసుకువచ్చింది. చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది. -
అమ్మాయిలూ.. అది ఉత్సాహం కాదు సెక్స్ అప్పీల్!
కొంచెం బాధ, మరికొంచెం జాలి, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, అమితమైన ప్రేమ..ఇలా ఏ భావాన్ని అయినా, ఎంత భారీ భావోద్వేగాన్ని అయినా సింపుల్‌గా వ్యక్తపరచడానికి ఎమోజీలును ఉపయోగిస్తుంటాం. అలాంటి ఎమోజీలకు గుర్తింపు దక్కిన రోజు ఇది. ఇవాళ (జులై 17)న వరల్డ్ ఎమోజీ డే. స్మార్ట్ ఫోన్లలో ఎన్ని అప్డేట్లు వస్తున్నా, మెసేజింగ్ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటాయి. అవతలి వాళ్లు చాంతాడంత మెసేజ్ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా ఏంటో తెలుస్తుంది. చాలామందికి ఇవి పనుల్ని తేలిక చేస్తుంటాయి, కొందరికి సరదా పంచుతుంటాయి. ఇక మంచం మీద నుంచి లేవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా, కాలకృత్యాల నుంచి ప్రతీ పనికి ఏదో సింబల్‌తో ఎమోజీలు కనిపిస్తూనే ఉంటాయి. కొత్తగా అప్డేట్స్లతో వస్తుంటాయి. అయితే పసుపు రంగులో ఉండే ఈ గుర్తుల్లో కొన్నింటిని కొందరు పొరపాటుగా అర్థం చేసుకుంటుంటారు. ఉదాహరణకు.. క్లాప్స్ సింబల్‌ను కొందరు దణ్ణం సింబల్‌గా పొరబడుతుంటారు. అలాగే కొన్ని ఎమోజీలకు అర్థాలు వేరుగా కూడా ఉన్నాయి. స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ ముఖంలో సిగ్గు.. సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్లు.. చుట్టూ హార్ట్ సింబల్స్. చాలామంది దీనిని సిగ్గుకి, సంతోషానికి, అవతలివాళ్లపై ఆప్యాయతను వ్యక్తపర్చడానికి ఉపయోగిస్తుంటారు. ఎవరికి పడితే వాళ్లకు పంపిస్తుంటారు. కానీ, ఆ ఎమోజీ అసలు ఉద్దేశం తాను పీకలలోతులో ప్రేమలో మునిగిపోయానని అవతలి వాళ్లకు తెలియజెప్పడం. డ్యాన్సింగ్ ట్విన్స్ విత్ హార్న్స్ ఇద్దరు అమ్మాయిలు నెత్తిన కొమ్ముల మాదిరి(కుందేలు చెవులు) వాటితో డ్యాన్స్ చేసే ఎమోజీ. చాలామంది అమ్మాయిలు గ్రూపులలో ఈ ఎమోజీలను ఎక్కువగా వాడుతుంటారు. ఎగ్జయిట్‌మెంట్‌కు దీన్నొక ప్రతీకగా దానిని భావిస్తుంటారు. కానీ, దాని అసలు అర్థం అది కాదు. నెత్తి మీద అలా కుందేలు చెవులు, కొమ్ములు ఉండే ఆ ఎమోజీని ‘సెక్స్ అప్పీల్’ కోసం పెట్టారు. అంతేకాదు అడల్ట్ సినిమాల్లోనూ ఇలాంటి గెటప్‌లను అవతలివాళ్లను రెచ్చగొట్టే చేష్టల కోసం ఉపయోగిస్తుంటారు. ఇక జపాన్ కాన్సెప్ట్‌లో ఫిక్షన్ క్యారెక్టర్లకు సంబంధించి గెటప్‌లను వేసినప్పుడు ‘కాస్ప్లే’ పేరిట ఈ సింబల్‌ను ఉపయోగిస్తారు. ప్లీడింగ్ ఫేస్ ఈ ఎమోజీకి ఏడుపుగొట్టు ఎమోజీ అనే పేరుంది. కానీ, దీన్ని పప్పీ డాగ్ ఐస్ అంటారు. ‘వేడుకోలు’ కిందకు వస్తుంది ఇది. అయితే ‘టచ్ చేశావ్’ అనే భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేసేందుకు ఈ ఎమోజీని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. షూటింగ్స్టార్ మ్యాజిక్ ఎమోజీ అని కూడా పిలుచుకుంటారు. ఎక్కువ ఉత్సాహంలో, ఉద్రేకంలో ఉన్నప్పుడు ఈ ఎమోజీని ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇది మైకాన్ని ఉద్దేశించి రూపొందించిన ఎమోజీ. ది పూప్ ఎమోజీ సింబల్ చూస్తేనే ఇదేంటో అందరికీ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ మధ్య సరదా సంభాషణల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. కానీ, దీని అర్థం ‘అదృష్టం’ అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కావాలంటే ఎమోజీ డిక్షనరీ ఓపెన్ చేసి చూడడండి. ఎమోజీలు ఎప్పటికీ ఫేడ్ అవుట్ కావు. ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి, పైన చెప్పిన ఎమోజీలను నెక్స్ట్ ఎప్పుడైనా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. అన్నట్లు లండన్‌కు చెందిన ఎమోజీపీడియా ఫౌండర్ జెర్మీ బర్గ్(37).. 2014 జులై 17న వరల్డ్ ఎమోజీ డేను మొదలుపెట్టాడు. అంతేకాదు ఈరోజున ఎమోజీలను ఎక్కువగా ఉపయోగించడంటూ ఓ పిలుపు కూడా ఇచ్చాడు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన కొత్త ఎమోజీలలో.. గర్భంతో ఉన్న మగవాళ్ల ఎమోజీ విమర్శలతో పాటు విపరీతమైన చర్చకూ దారితీస్తోంది.