breaking news
Women Dwarka
-
వచ్చారు.. వెళ్లారు..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల ముందు ఇబ్బడిముబ్బడిగా జిల్లాలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక సీఎంగా ఏడాదిలో ఐదు పర్యాయాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజ లకు హామీలు గుప్పించారు. అంతే... ఇంతవరకు ఒక్క హామీ నెరవేరితే ఒట్టు. జిల్లా పాల కులు కూడా సీఎం ఇచ్చిన హామీలను పూర్తిగా మరచిపోయారు. పర్యటన సమయంలో ప్రజావ్యతిరేకత రాకుండా హామీలు గుప్పిం చడం, అనంతరం వాటిని విస్మరించడమే అలవాటుగా మారింది. 2014 సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలో తొలిసారిగా పర్యటించా రు. ఈ పర్యటనలో కేవలం ఒక ప్రవేటు ఫార్మా సంస్థను ప్రారంభించారు. స్థానికంగా పతివాడపాలెంలో గ్రామస్తులతో ముఖాముఖి ఏర్పాటుచేసినా ఫలితం శూన్యమే. డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొ ప్పున జమచేస్తామని సభలో ప్రకటించారు. అనంతరం వాటిని రూ.3వేలకు పరిమితం చేశారు. అది కూడా జన్మభూమి కమిటీల్లో దశలవారీగా పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ఇచ్చిన వరకు మహిళలకు నమ్మకం కుదరని పరిస్థితి. 2014 అక్టోబర్ 15న హుద్‌హుద్ తుపాను ప్రభావంతో ముంపునకు గురైన పొందూరు మండలంలోని మొదలవలస, శ్రీకాకుళం పట్టణంలోని పలు ప్రాంతాలు పర్యటించారు. కింతలి మీదుగా వెల్లినా మొదలవలస గ్రామం పక్కనే ఉన్న రెల్లిగడ్డ వరదల నుంచి ఆ గ్రామాన్ని, అక్కడ పొలాలను రక్షించేందు కు చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. ఆ తరువాత ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూనరవికుమార్లు రెల్లిగెడ్డ అభివృద్ధివైపు కన్నెత్తిచూడలేదు. 2014 అక్టోబర్ 23న శ్రీకాకుళం రూరల్ మండలంలో కుందువానిపేట గ్రామంలో హుద్‌హుద్ తుపాను బాధిత కుటుంబాలను పరామర్శించారు. తుపానుకు తట్టుకునేలా మత్య్సకారులకు శాశ్విత ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతే.. అక్కడతో ఆ హామీ గాలిలో కలిసిపోయింది. ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క ప్రతిపాదన కూడా చేయలేదు. స్థలాన్ని కూడా సేకరించ లేదు. 2015 ఫిబ్రవరి11న ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు తనయుని వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇది కూడా వ్యక్తిగతంగా నిలిచిపోయింది. 2015 ఫిబ్రవరి 14 నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. తీరా సగం మంది రైతులకు మొండిచేయి చూపారు. కొర్రీలతో కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. అదే రోజు చిలకపాలెంలో శివానీ ఇంజినీరింగ్ కళాశాలో విద్యార్ధులతో ముఖాముఖి చేపట్టారు. వ్యక్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఈ హామీ కూడా ఆచరణకు నోచుకోలేదు. -
రైతులు, మహిళలే సైన్యంగా మహాధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన అనంతరం మాఫీ చేయడానికి పూటకో నిబంధన విధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడటానికి రైతులు, మహిళలు సైన్యంలా రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం ఏలూరులో విలేకరులతో తాడేపల్లిగూడెం :ఐదారేళ్లుగా పింఛను తీసుకుంటున్న వారిని అనర్హులుగా ప్రకటించడమేమిటని ప్రశ్నించిన తనను మునిసిపల్ కమిషనర్ పి.నిరంజన్‌రెడ్డి కులం పేరుతో దూషించారని, మెడపట్టి గెంటివేశారని తాడేపల్లిగూడెం ఒకటో వార్డు కౌన్సిలర్ సింగం సుబ్బారావు బుధవారం ఆరోపించారు. న్యాయం చేయూలని కోరుతూ మునిసిపల్ కార్యాలయం కార్యాలయం ఎదుట బుధవారం వృద్ధులతో కలసి ధర్నాకు దిగారు. సంఘటన వివరాలిలా ఉన్నయి...తన వార్డుకు చెందిన 65 ఏళ్లకు పైబడి, 75 ఏళ్లకు లోపు ఉన్నవారిని వెంటతీసుకొని వెళ్లి పింఛన్ల విషయమై కమిషనర్‌ను ప్రశ్నించగా అనుచితంగా ప్రవర్తించారని చెప్పారు. వృద్ధులని కూడా చూడకుండా సిబ్బందితో వారిని కూడా గెంటించి వేరుుంచారని చెప్పారు. ఇందుకు కారణం వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ ప్రాంతానికి చెందినవారు కావడమేనని అన్నారు. ఎస్టీ కులానికి చెందిన తనను దుర్భాషలాడటంతో పాటు, మెడ పట్టి బయటకు గెంటిన కమిషనర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని వృద్ధులతో కలిసి నినాదాలు చేశారు. వార్డులో 313 పింఛన్లు ఉండగా, వీటిలో అర్హులైన వారి పింఛన్లు 70 నిలుపుదల చేశారని, వృద్ధులు తన ఇంటి చుట్టూ తిరుగుతుంటే విషయం అడగటానికని, వారిని వెంట పెట్టుకొని కమిషనర్ వద్దకు వెళ్లానని చెప్పారు. ఈ విషయం గురించి అడుగుతుంటే , ఒక్కసారిగా కమిషనర్ కోపంతో పళ్లు కొరుకుతూ కులం పేరుతో అసభ్య పదజాలంతో తిట్టి మెడపట్టి బయటకు గెంటేశారని తెలిపారు. వెనుక వచ్చిన వృద్ధులను సిబ్బందితో గెంటించి వేశారని చెప్పారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వాస్తవాలను తెలుసుకొని పరిస్థితిని చక్కబెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు యెగ్గిన నాగబాబు, మారం వెంకటేశ్వరరావులు ప్రయత్నం చేశారు. కమిషనర్ పి.నిరంజన్‌రెడ్డితో మాట్లాడారు. కౌన్సిలర్తోను, వృద్ధుల తోను తాను దురుసుగా వ్యవహరించలేదని కమిషనర్ వారికి తెలిపారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన నాయకులకు వృద్ధులు కమిషనర్ ఎలా ప్రవర్తించి తమను బయటకు గెంటించింది వివరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రూరల్ ఎస్ఐ కఠారి రామారావు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు కమిషనర్‌ను ఆయన చాంబర్ నుంచి బయటకు తీసుకువచ్చి, కౌన్సిలర్, వృద్ధులతో మాట్లాడించారు. కమిషనర్ మాట తీరు మారకపోవడంతో నొచ్చుకున్న కౌన్సిలర్ సుబ్బారావు, వృద్ధులతో కలిసి కమిషనర్ వైఖరిని నిరసిస్తూ ప్రదర్శనగా కేఎన్రోడ్ మీదుగా పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. న్యాయం కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నవారికే పింఛన్లు ఇస్తున్నారు ఏదో మందు బిళ్లలకు పింఛన్ డబ్బులు వస్తాయని ఆశపడుతున్నం వాళ్లం. వచ్చేవాటి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం,. మీకు పింఛన్ రాదు, మీ పేర్లు పింఛన్ జాబితాలో లేవని చెబుతున్నారు. 70 ఏళ్ల వయస్సు దాటిన మాకు పింఛన్లు ఎందుకు రావడం లేదని కౌన్సిలర్ ఇంటికి వెళితే అడుగుదామని కమిషనర్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన మమ్మల్ని గెంటించేశారని ఐ.బాపాయమ్మ, బాయిశెట్టి రమణమ్మ, యలిశెట్టి అంజమ్మ, నాయుడు రామాయమ్మ, కందేటి పార్వతి, అత్తిలి వరలక్ష్మి, జే.మంగమ్మ తదితరులు తెలిపారు. మూడు, నాలుగు వార్డులలో కాని, ఒకటో వార్డులో కాని పింఛన్లు ఇచ్చే రోజుకు రండి, డబ్బున్నవారు ఎంతమంది పింఛన్ తీసుకుంటున్నారో మీకే తెలుస్తుందని మీడియాకు తెలిపారు. ఎరుకల కులస్తుల సంఘీభావం వార్డులోని పింఛన్ అందని వృద్ధులు కొందరు అక్కడికి చేరుకున్నారు. ఎరుకల కులానికి చెందిన కౌన్సిలర్‌పై కమిషనర్ దురుసుగా ప్రవర్తించారని తెలుసుకున్న ఆ కులస్తులు మున్సిపల్ కార్యాలయానికి చేరి సంఘీభావం ప్రకటించారు. కమిషనర్‌పై చర్య తీసుకోవాలి తనను కులం పేరుతో దూషించి మెడపట్టి బయటకు గెంటిన కమిషనర్ పి.నిరంజన్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని కౌన్సిలర్ సుబ్బారావు కోరారు. ఈ మేరకు వినతి పత్రాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డీఐజీ, మానవ హక్కుల సంఘం, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్‌లకు పంపించారు. కౌన్సిలర్ వైఖరి సరికాదు మునిసిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పింఛన్ల విషయంలో ఒకటో వార్డు కౌన్సిలర్ సింగం సుబ్బారావు బుధవారం విధి నిర్వహణలో ఉన్న కమిషనర్ చాంబర్లోకి వెళ్లి దౌర్జన్యం చేసి దుర్భాషలాడటం విచారకరమని మునిసిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, ఎస్.సర్వేశ్వరరావు ఒక ప్రకటనలో ఖండించారు. వ్యక్తిగత లబ్ధి కోసం ప్రజా సేవకులైన అధికారులపై ఇదే తరహాలో మరో మారు ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. కౌన్సిలర్లే కాకుండా ప్రజలు సైతం ఇక్కడి నుంచి సమస్యలకు పరిష్కారం పొందవచ్చన్నారు.