breaking news
wall poster released
-
మనస్తాపంతో జీవితాలు నాశనం చేసుకోవద్దు
చిలప్‌చెడ్(నర్సాపూర్): ఏ దశలో ఉన్న వ్యక్తులైనా మనస్తాపం చెంది తోందరపాటు పనులు చేస్తూ, తమ జీవితాలతో పాటు తమను నమ్ముకున్న కుటుంబ సభ్యుల జీవితాలను కూడా నాశనం చెయ్యొద్దని స్థానిక ఎస్సై మల్లయ్య కోరారు. శుక్రవారం జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదేశాల మేరకు మనిషి వ్యర్థమైన ఆలోచనలతో జీవితం నాశనం చేసుకోవద్దు అనే అంశంపై అవగాహన కల్పించే గోడ పత్రికను ఆవిష్కరించారు. చిలప్‌చెడ్ మండలంలోని గ్రామాలలో ఆ గోడ పత్రికలు అంటించే విధంగా చర్య తీసుకున్నామన్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్ధులు బాగా చదువుకుని స్థిరపడే విధంగా ఆలోచించాలి కానీ మార్కులు తక్కువగా వచ్చాయని, తల్లితండ్రులు మందలించారని మనస్తాపానికి లోను కావద్దన్నారు. యువతీ యువకులు ప్రేమ విఫలమైందని, చదివిన చదువులకు జాబ్‌లు రాలేదన్న కారణంగా చెడు మార్గాల వైపు వెళ్లడంలాంటివి చేయవద్దన్నారు. రైతులు పంట పండటం లేదని, నీళ్లు తగ్గాయని తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తశుద్ధితో పోరాడుతోంది వైఎస్ఆర్ సీపీ మాత్రమేనని పార్టీ ఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఉదయం తన నివాసంలో బాలినేని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వంద్వ నీతితో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు సహకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం కిరణ్ తీరును ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే సమైక్య శంఖారావం చేపడుతున్నట్లు వివరించారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న చిత్తూరు జిల్లా నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సమైక్య శంఖారావాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగం కరపత్రాలు, వాల్‌పోస్టర్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సమైక్యవాదులంతా జగన్‌కు మద్దతివ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటేశ్వరరావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, ైనాయకులు తిరుమలరావు, సింగరాజు వెంకట్రావు, మీరావలి, శంకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.